జమ్మూకశ్మీర్‌: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి

jammu
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సుంజ్ వాన్ ఆర్మీక్యాంప్ లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. సైన్యం టార్గెట్ గా కాల్పులు జరిపారు. అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. మిలిటెంట్లు ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియడం లేదన్నారు సైనిక అధికారులు. ముగ్గురు లేదా నలుగురు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు మిలిటెంట్లు ఆర్మీ క్యాంప్ లోకి ఎంటరయ్యారు. ఓ జేసీఓ కుటుంబం ఉంటున్న క్వార్టర్ లోకి ప్రవేశించారు. క్వార్టర్స్ గేట్ పై కాల్పులు జరిపారు. అక్కడున్న ఇద్దరికి బుల్లెట్ గాయాలు తగిలాయి. ఓ హవల్దార్ .. అతడి కూతురు ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడటంతో వారిని వెంటనే హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే మరోసారి ఫైరింగ్ శబ్దం వినిపించిందని ఆర్మీ అధికారులు చెప్పారు.

బుల్లెట్ శబ్దాలు వచ్చిన ఏరియాను భద్రత బలగాలు చుట్టుముట్టాయి. ఆ ఏరియాలో ఉగ్రవాదులు ఎక్కడున్నారన్నది తెల్సుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఐజీ ఎస్డీ సింగ్ చెప్పారు. సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఆర్మీ క్యాంప్ కు కిలోమీటర్ దూరంలోని స్కూళ్లు ఓపెన్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు.. పార్లమెంట్ పై దాడి కేసులో నిందితులు మహమ్మద్ అఫ్జల్ గురు, జమ్ము , కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవయస్థాపకుడు మక్బూల్ భట్ ల వర్ధంతి సందర్భంగా అలర్ట్ గా ఉండాలని నిఘా వర్గాలు ఇప్పటికే అలర్ట్ చేశాయి.

Posted in Uncategorized

Latest Updates