జమ్మూకశ్మీర్ లో కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు మృతి

జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. సోపూర్ జిల్లాలో ద్రూసు గ్రామం దగ్గర ఉగ్రవాదులున్నారన్న సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates