జమ్మూలో కాల్పులకు తెగబడ్డ పాక్

JAMMUజమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం (ఫిబ్రవరి-27) మళ్లీ కాల్పులకు దిగింది పాకిస్థాన్ సైన్యం. రాజౌరీ జిల్లాలోని మంజకోటె సెక్టార్ లో సరిహద్దు గ్రామాలపై పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతోంది. అయితే భారత బలగాలు కూడా పాక్ కాల్పులకు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు భీంబర్ గలి సెక్టార్ లోనూ ఉదయం 8గంటల 45 నిమిషాల నుంచి కాల్పులు చేస్తోంది పాక్ సైన్యం. స్మాల్ ఆర్మ్స్, ఆటోమాటిక్స్, మోర్టార్స్ తో దాడులు చేస్తోంది. భారత సైన్యం కూడా అదే స్థాయి ఆయుధాలతో బదులిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates