జమ్ము కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన

బుధవారం అర్ధరాత్రి నుంచి జమ్ము కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమలు కానుంది. ఈ ఏడాది మెహాబూబా ముఫ్తీ ప్రభుత్వం నుండి బీజేపీ వైదొలగడంతో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గవర్నర్ పాలన విధించారు. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నికలు నిర్వహించనందువల్ల రాష్ట్రపతి పాలన విధించాలని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అంగీకరించారు. 1996 తర్వాత జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇదే తొలిసారి.

Posted in Uncategorized

Latest Updates