జమ్మూ-కాశ్మీర్ లోఎన్ కౌంటర్…ఒక ఉగ్రవాది హతం

pkజమ్మూ-కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని ట్రెగమ్ దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు చంపేశాయి. ఎన్ కౌంటర్ ముగిసిందని… అయితే సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది. ఇక షోపియాన్ జిల్లా అగమ్ లో ఆర్మీ ప్యాట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. దీంతో ఒక జవాన్ గాయపడ్డాడు. వెంటనే అలర్ట్ అయిన ఆర్మీ ఆ ఏరియాలో ఉగ్రవాదుల కోసం గాలింపు జరుపుతోంది.
కశ్మీర్ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ విధానం కాదన్నారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. కశ్మీర్ లో హింస సృష్టిస్తున్న ఉగ్రవాదులను తరిమికొట్టడమే ఆర్మీ లక్ష్యమన్నారు. గతంలో రూపొందించబడిన విధానాల ప్రకారమే… కశ్మీర్ లో ఆర్మీ తన ఆపరేషన్స్ కొనసాగిస్తోందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే ఆపరేట్ చేస్తున్నామన్నారు బిపిన్ రావత్.

Posted in Uncategorized

Latest Updates