జమ్మూ-కాశ్మీర్ సీఎం రాజీనామా

meజమ్మూ-కాశ్మీర్ సీఎం పదవికి రాజీనామా చేశారు మెహబూబా ముఫ్తీ. బీజేపీ మద్దతు ఉపసంహరణపై స్పందించారు పీడీపీ నాయకులు. మద్దతు ఉపసంహరించుకుంటూ  బీజేపీ తీసుకున్న నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు పీడీపీ అధికార ప్రతినిధి రఫీ అహ్మద్. బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడిపించడానికి తాము అన్ని విధాల ప్రయత్నించామన్నారు. బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కనీసం తమకు ఒక మాట కూడా చెప్పలేదన్నారు. మరో వైపు రాష్ట్రంలో గవర్నర్ పాలనవైపే బీజేపీ మొగ్గు చూపుతుంది. కాల్పుల విరమణపైనే రెండు పార్టీల మధ్య విభేధాలు ఏర్పడ్డాయని బీజేపీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ ప్రకటించారు. అభివృద్ది, శాంతిస్ధాపన విషయాల్లో రెండు పార్టీల మధ్య విభేధాలున్నాయన్నారు.కాశ్మీర్ లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయిందన్నారు. పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కల్గుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates