జమ్మూ తలరాత మారుస్తాం : రాజ్ నాథ్

RAJNATHజమ్మూకశ్మీర్ తలరాత మారుస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. 2016 వాల్డ్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ సాధించిన కశ్మీర్ బాలిక తజముల్ ఇస్లాంను గురువారం (జూన్-7) ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటలు ఎంతో ముఖ్యమన్నారు రాజ్ నాథ్. ఆటల్లో మంచి నైపుణ్యంతో ఎంతో సాధించడానికి వీలుందన్నారు హోంమంత్రి. రాజ్ నాథ్ రెండు రోజుల పాటు కశ్మీర్ లో పర్యటిస్తారు.

సరిహద్దులో చొరబాట్ల సందర్భంగా జరుగుతున్న కాల్పులు, పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు, తీవ్రవాదుల చొరబాట్లు, సైనికులపై రాళ్ల దాడులు సహా రాష్ట్రంలో అలజడికి కారణమవుతున్న పలు అంశాలపై హోమంత్రి సమీక్ష చేస్తారు. ప్రత్యేకించి అమర్ నాథ్ యాత్ర కోసం ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates