జయనగర్ లో కాంగ్రెస్ విజయం

sowmyareddy1306 కర్ణాటకలోని జయనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 4 వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి గెలుపొందింది. సౌమ్య రెడ్డికి 54,045 ఓట్లు రాగా, సమీప బీజేపీకి అభ్యర్థికి 50,270 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో గుండెపోటుతో మృతి చెందడంతో జయనగర్ నియోజకవర్గం ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడిన జయనగర్ నియోజకవర్గానికి ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి.

Posted in Uncategorized

Latest Updates