జయరాజుకు సుద్దాల పురస్కారం

ప్రముఖ కళాకారులు, సాహితీవేత్తలు, కవులకు ఏటా సుద్దాల ఫౌండేషన్‌ సంస్థ ప్రదానం చేస్తన్న సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ ప్రజాకవి జయరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు 14న హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును జయరాజుకు ప్రదానం చేస్తామని వెల్లడించారు సంస్థల ప్రతినిధులు. సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని జయరాజుకు ఇస్తున్నట్లు ప్రకటించారు సుద్దాల ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సంస్థ శాశ్వత సభ్యుడు వైకే నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌, ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ముఖ్యఅతిథులుగా హాజరవుతారని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates