జయలలిత బయోపిక్ పై కీర్తి క్లారిటీ

keerthisureshసావిత్రి బయోపిక్ ఆదారం వచ్చిన మహానటి సినిమాలో కీర్తిసురేశ్ నటనకు అన్ని వర్గాల ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేశ్ ప్రముఖ నటి, దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం(మే15) తిరుమల శ్రీవారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్న ఆమె…జయలలిత బయోపిక్ గురించి తనతో ఎవరు మాట్లాడటం కానీ, సంప్రదించడం కానీ జరుగలేదని చెప్పింది. ప్రస్తుతం కీర్తి  తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ పలు  సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates