జయశంకర్ సార్ సేవలు మరువలేనివి : కేటీఆర్

ktrతెలంగాణ ఉద్యమం సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన కేటీఆర్ జయశంకర్ సార్ కు నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం విరామం లేకుండా…కమిట్ మెంట్ తో పని చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు. రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ కు అన్ని రకాల ధైర్యం చెప్పారన్నారు. రాష్ట్రం కోసం చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరుతో జయశంకర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నామన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates