జయహో భారత్ : హాఫ్ సెంచరీ పతకాలతో దుమ్మురేపారు

GOLDSకామన్వెల్త్  పదో రోజు భారత్ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. పతకాల వేటలో పవర్ చూపుతున్నారు. భారత్ అకౌంట్ లో ఇవాళ ఒక్క రోజే ఐదు గోల్డ్ మెడల్స్ తోసహా మొత్తం 8 మెడల్స్ చేరాయి. మరిన్ని మెడల్స్ ఖాయమయ్యాయి. స్టార్ రెజ్లర్ మేరీకోమ్  విసిరిన పంచ్ లకు బంగారం దక్కింది. 45 నుంచి 48 కేజీల విభాగంలో పోటీపడిన మేరీకోమ్.. నార్తర్న్ ఐర్లాండ్ ప్లేయర్ క్రిస్టియానా హరాపై విజయం సాధించింది. భారత్ ఖాతాలో చేరిన 18వ స్వర్ణ పతకం ఇది. కామన్ వెల్త్ లో మేరీకోమ్ కు ఇదే ఫస్ట్ మెడల్.

మెన్స్ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో షూటర్ సంజీవ్ రాజ్ పుత్ గోల్డ్ మెడల్ సాధించాడు. మెన్స్ 52కేజీల విభాగంలో రెజ్లర్ గౌరవ్ సోలంకి బంగారు పతకం గెల్చుకున్నాడు. ఈ విభాగంలో రెండో పసిడి పతకం సాధించిన రెండో బాక్సర్ గా గౌరవ్ సోలంకి నిలిచాడు. పురుషుల జావెలీన్ త్రో ఈవెంట్ లో.. నీరజ్ చోప్రా స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. 86.47 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రస్థానంలో నిలిచాడు నీరజ్ చోప్రా. ఇండియాకు దక్కిన 21వ స్వర్ణం ఇది. అతకుముందు 46-49 కేజీల విభాగంలో జరిగిన బాక్సింగ్ బౌట్ లో అమిత్ పంఘాల్  సిల్వర్ మెడల్ సాధించాడు.  ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 22 బంగారు, 13 వెండి, 15 కాంస్యపతకాలున్నాయి. 50 పతకాలతో భారత్ 3వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు ఫైనల్ కు చేరింది. ఇప్పటికే ఫైనల్ చేరిన సైన నెహ్వాల్ తో సింధు ఫైనల్ ఫైట్ ఆడనుంది.

Posted in Uncategorized

Latest Updates