జరిగిన అద్భుతం చాలు : నితీశ్ కు నో ఎంట్రో చెప్పిన తేజ్ ప్రతాప్

tataబిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను తన ఇంట్లోకి కూడా రానివ్వబోనన్నారు RJD అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్. తన ఫేస్ బుక్ అకౌంట్ ను బీజేపీ-ఆరెస్సెస్  హ్యాక్ చేసిందని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. తనకు పెరుగుతున్న పాపులారిటీని చూసి తట్టుకోలేక సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం నితీశ్ కుమార్ తన సోషల్ మీడియా ప్రోఫైల్స్ ను హ్యాక్ చేస్తున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వంలో నితీశ్ మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు తేజ్ ప్రతాప్.
మహాకూటమి నుంచి విడిపోయిన నితీశ్… మళ్లీ ఆ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మహాకూటమిలోకే కాదు… నితీశ్ ను తన ఇంటికి కూడా రానివ్వబోనన్నారు. నో ఎంట్రీ నితీశ్ చాచా అనే పేపర్ ను ఇంటి గేట్ కు అతికించారు తేజ్ ప్రతాప్. కొంతకాలంగా వివిధ అంశాలపై నితీశ్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కు స్పెషల్ స్టేటస్, డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి అంశాలపై బీజేపీపై బహిరంగంగానే నితీశ్ విమర్శలు చేశారు. దీంతో నితీశ్ బీజేపీని వదిలిపెట్టి మహాకూటమిలోకి వస్తున్నారనే వార్తలు కొంతకాలంగా అటు సోషల్ మీడియాలో కూడా హాల్ చల్ చేస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates