జలమండలిలో 615 ఉద్యోగాలు : త్వరలో నోటిఫికేషన్

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్‌బోర్డు(వాటర్‌బోర్డు)లో వివిధ విభాగాల్లో 615 కొత్తపోస్టులను త్వరలో భర్తీచేయనున్నారు. నీటి సరఫరా విభాగంలో జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయీస్) 200, సీవరేజీ విభాగంలో 200, మేనేజర్లు 80, అసిస్టెంట్ పీ అండ్ ఏలో 20, అసిస్టెంట్ ఎఫ్ అండ్ ఏలో 15, టెక్నికల్ గ్రేడ్ అసిస్టెంట్లు 100 పోస్టులను భర్తీ చేయనుంది జలమండలి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి జలమండలికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నేరుగా జరపుకోవచ్చని పేర్కొన్నది. ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ, వాటర్‌బోర్డు పరిధి 688 చదరపు కిలోమీటర్ల నుంచి 1456 చదరపు కిలోమీటర్ల మేరకు పెరగడంతో ఖాళీలను తక్షణమే భర్తీచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దరఖాస్తు ప్రక్రియ, ఎంపికకు సంబంధించిన పూర్తివివరాలతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు జలమండలి అధికారులు.

Posted in Uncategorized

Latest Updates