జలసమాధి : నది మధ్య 60 అడుగుల లోతులో లాంచీ

godavari-boatఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా గోదావరి నదిలో మునిగిన లాంచీ ఆచూకీ లభ్యం అయ్యింది. మంటూరు దగ్గర 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. రెండు కొండల మధ్య ఉండటం.. ఇసుకలో ఇరుక్కుని ఉండటంతో బయటకు తీయటానికి ఆలస్యం అవుతుంది. లాంచీలోనే మృతదేహాలు ఉన్నట్లు నిర్థారించారు గజ ఈతగాళ్లు, NDRF సిబ్బంది. నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగింది. హెలికాఫ్టర్ల సాయంతో అవసరం అయిన చర్యలు తీసుకుంటున్నారు. భారీ క్రేన్లు, పెద్ద పెద్ద బోటుల సాయంతో వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

60 అడుగుల లోతులో ఉన్న బోటులోనే మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఎంత మంది ఉన్నారు అనేది ఇంకా నిర్థారించలేదు. కనీసం 40 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా దేవీపట్నం, పోలవరం, రంపచోడవరం గ్రామాలకు చెందిన వారు. రాత్రి సమయంలో భారీ వర్షం, ఈదురుగాలులు రావటంతో అందరూ బోటు లోపలికి వెళ్లారు. గాలుల నంచి రక్షణ కోసం బోటు అద్దాలు మూసివేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు బోటు తిరగబడింది. బోటు పైన కూర్చున్న  15 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.  లోపల ఉన్న 40 మంది జలసమాధి అయ్యారు. బోటులో  ఉన్న సిమెంట్ బస్తాలు తడవకుండా ఉండటం కోసం బోటు నడిపేవ్యక్తి తీసుకున్న అతి ఉత్సాహం.. ఈ ప్రమాదం జరగటానికి కారణంగా తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates