జల్సాలకు అడ్డొస్తున్నారని.. తల్లి, తండ్రి, చెల్లి హత్య

ఢిల్లీలో దారుణం జరిగింది.  తన జల్సాలకు అడ్డొస్తున్నారని తల్లిదండ్రులు,చెల్లిని చంపేశాడో దుర్మార్గుడు.  ఇంటీరియర్  డిజైనర్ గా పనిచేస్తున్న మిథిలేశ్.. భార్యా  పిల్లలతో కలిసి సౌత్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. అతడి కొడుకు సూరజ్(19) గుర్ గ్రామ్ లోని ఓ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్ చదువులో వెనుకబడటంతో పేరెంట్స్.. ఫ్రెండ్స్  తో తిరగొద్దని, వారిని ఇంటికి తీసుకొని రావొద్దని చెప్పారు. దీంతో కోపం పెంచుకున్న సూరజ్.. వారిని చంపాలని అనుకున్నాడు.

వీరితో పాటు తన విషయాలను తల్లి దండ్రులకు చెపుతుందన్న కారణంతో చెల్లిని కూడా హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. నిన్న(అక్టోబర్ 10) ఉదయం.. ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులు,చెల్లెలి పై సూరజ్ కత్తితో దాడి చేసి కిరాతకంగా చంపాడు. ఎవరికీ అనుమానం రాకుండా కత్తితో తనను గాయపరచుకున్నాడు. తర్వాత పక్కింటి వాళ్లని పిలిచి తన తల్లిదండ్రులను దొంగలు చంపారని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సూరజ్ ను స్టేషన్ కు తీసుకొని వెళ్లి విచారించారు. అయితే అతడు చెబుతున్న సమాధానాల పై  అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates