జస్ట్ టైమ్ గ్యాప్ అంతే : టెన్నిస్ లో నెం.1 ఫెదరర్

teeటెన్నిస్‌లో మళ్లీ టాప్ ప్లేస్ లో నిలిచాడు స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్. ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన రోటర్‌డ్యామ్ ఓపెన్‌లో జరిగిన క్వార్టర్స్‌లో గెలిచిన ఫెదరర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఫెదరర్‌కు టోర్నీ నిర్వాహాకులు ప్రత్యేకంగా నెంబర్ వన్ షీల్డ్‌ను అందించారు. గతంలో ఫెదరర్ వరుసగా 302 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచాడు. అయితే కొన్నాళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ తిరిగి ఆ స్ధానాన్ని ఫెదరర్ కైవసం చేసుకొన్నాడు. 36 ఏళ్ల వయసులో నెంబర్ స్థానం దక్కించుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా ఫెదరర్ రికార్డు క్రియేట్ చేశాడు. క్రీడల్లో నెంబర్ వన్ స్థానానికి రావడం అతిపెద్ద సక్సెస్ అని ఫెదరర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates