జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ : జియోకి జంప్ అయిన ఎయిర్ టెల్ భామ

GHఎయిర్ టెల్ 4G అడ్వర్టైజ్ మెంట్ తో సెలబ్రెటీగా మారిన శాషా చెత్రి ఎయిర్ టెల్ ను వదిలేసింది. తన ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిన శాషా ఇప్పుడు ఎయిర్ టెల్ ను వదిలి జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ అన్నట్లుగా జియోకు వెళ్తుంది.దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఫేస్‌బుక్ లో పోస్టు చేసింది. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అందరూ ప్రయత్నాలు సాగించండి. తగినది ఎంచుకోండి, లైఫ్ లో ప్రతీ ఒక్కటి ట్రై చెయ్యాల్సిందే, లేకుంటే తప్పొప్పులు ఎలా తెలుస్తాయి,  ఇక్కడ నాకొక విషయం నచ్చలేదు. నేను ఇతరులకు మాత్రమే మీరు ఫలానా కంపెనీ సిమ్ వాడండి సరైనది ఎంచుకోండని చెప్తున్నాను. అందుకే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను కూడా ఇక నుంచి ఒక్కొక్కటీ ప్రయత్నిస్తూ, అన్ని కంపెనీలనూ ట్రై చేస్తానని ఆ వీడియోలో శాషా తెలిపింది. అయితే ఇదే చివరి నిర్ణయం కాదని ఒకవేళ ఇతర కంపెనీల స్పీడ్ నచ్చకపోతే తిరిగి ఎయిర్‌టెల్‌ కు తిరిగి వచ్చేస్తానని కూడా శాషా ఆ వీడియోలో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates