జస్ట్ మిస్….ప్రాణం మీదకు తెచ్చుకున్న యువతి స్టంట్

లోకల్ ట్రెయిన్ ఫుట్‌ బోర్డ్‌ పై స్టంట్ చేయబోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంది ఓ యువతి. ఓ క్షణం ఆలస్యమైనా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. సోమవారం(అక్టోబర్-1) ముంబైలోని ఘాట్‌ కోపర్, విక్రోలీ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.

థానె జిల్లా దివాకు చెందిన యువతి సీఎస్‌టీలో కల్యాణ్ వెళ్లే ట్రెయిన్ ఎక్కింది. సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ.. ఫుట్‌ బోర్డు దగ్గర నిలబడి… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్‌ లో మాట్లాడుతోంది. ఫుట్‌ బోర్డు మధ్యలో ఉన్న పోల్‌ ను పట్టుకొని మెలికలు తిరిగింది. ఇంతలో పట్టు తప్పి లోకల్ ట్రెయిన్ కిందికి జారింది. అప్పుడో వేరే లైన్ నుంచి మరో లోకల్ ట్రెయిన్ వెళ్తోంది. వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు ఆ యువతిని పైకి లాగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates