జాగ్రత్తగా ఖర్చుచేయండి : మోడీకి సిరిసిల్ల నుంచి 9పైసల చెక్కు

9-paise-cheque telanganaపెట్రోల్ ధరలపై రోజురోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు చెందిన వి.చంద్రయ్య తనదైన శైలిలో పెట్రోల్ ధరలపై తన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తగ్గిన 9పైసలను ప్రధానమంత్రి మోడీ రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. బ్యాంక్ చెక్కుపై 9పైసలు రాసి.. సిరిసిల్ల కలెక్టర్ కు ప్రజావాణి కార్యక్రమంలో అందజేశారు. ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ పై 9 పైసలు తగ్గించాయి.. నేను ఈ మొత్తాన్ని మోడీగారికి ఇవ్వదలిచాను. ఈ డబ్బు మంచి కార్యక్రమానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు చంద్రయ్య.

ఆయిల్ ధరలు పెరిగినంతగా.. తగ్గింపులో మాత్రం ఉండటం లేదన్నారు చంద్రయ్య. దేశంలోనే ఆల్ టైం హైకి ఇంధన ధరలు చేరుకున్నాయి అని.. వాహనదారులకు భారంగా మారిందన్నారు. 9పైసల చెక్కును ఏ సామాజిక కార్యక్రమానికి ఉపయోగిస్తారో చెబితే.. మేం కూడా ఫాలో అవుతాం అన్నారాయన. ప్రధాని మోడీ రిలీఫ్ ఫండ్ కు 9పైసల చెక్కును కలెక్టర్ ద్వారా అందించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates