జాగ్రత్తలు తీసుకుంటే తలసేమియాను అరికట్టవచ్చు

laxmareddyకొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే తలసేమియా వ్యాధిని అదుపు చేయవచ్చన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఆస్పత్రిలో శనివారం(జూన్-2) తలసేమియా, హీమోఫిలియా డే కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

తలసేమియా వ్యాధికి చికిత్స కాస్త ఖర్చుతో కూడుకున్నదని… హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స.. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ వ్యాధి నివారణకు సెంటర్‌ను ప్రారంభించామన్నారు. జిల్లాలో ఉన్న ఈ వ్యాధిగ్రస్తులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రసూతిలలో మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో ఉందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates