జాతిపితకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ఆయన సమాధి దగ్గర రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీలు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం  7.36 గంటలకు ప్రధాని 8.19 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

స్వచ్ఛతహహీ సేవ మిషన్‌లో భాగంగా పరిశుభ్రత, పునరుద్పాక శక్తికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. భారత దేశంలో పేదరికం రూపుమాపాలని, ఆర్ధికంగా, సామాజికంగా భారతీయులు వేగంగా ఎదగాలని గాంధీజీ కలలు కన్నారని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా.. ఇవాళ ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి  దగ్గర నివాళి అర్పించారు. భారత పర్యటనకు వచ్చిన యూఎన్ సెక్రటరీ జనరల్ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

Posted in Uncategorized

Latest Updates