జాతి మొత్తం గర్వించిందమ్మా.. : జాతీయగీతం వింటూ.. కన్నీళ్లు పెట్టిన హిమ

దేశంపై ప్రేమ అంటే ఇదే.. గుండెల్లో భారతదేశంపై ఉన్న మమకారం, అభిమానం అంటే ఇదే.. గుండెల్లో దేశంపై ఎంత ప్రేమ ఉంటేనే ఇలా కన్నీళ్లు వస్తాయి అంటూ ప్రపంచ జూనియర్ అథ్లెట్స్ లో పరుగు పందెంలో గోల్డ్ మెడల్ కొట్టిన అసోం అమ్మాయి హిమ దాస్ ను ఆకాశానికెత్తేసింది సోషల్ మీడియా. బంగారం పతకం అందుకునే సమయంలో.. భారతదేశం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ సమయంలో.. హిమ దాస్ ఉద్వేగంతో.. ఆనంద బాష్పాలు కార్చారు. కళ్ల వెంట నీళ్లు వస్తున్నా..  కనీసం కదలకుండా అలాగే బావోద్వేగంతో ఉండిపోయింది. జాతీయ గీతం వస్తున్నంతసేపూ కన్నీళ్లు ఆగలేదు.

దేశం మొత్తం ఈ ఫొటో, వీడియోతో ఫిదా అయ్యింది. దేశభక్తులు అని చెప్పుకునే సోకాల్డ్ భక్తులకు.. నిజమైన భక్తి అంటే ఇదే అంటూ నెటిజన్లు చురకలు కూడా అంటిస్తున్నారు. ఇక ప్రముఖ పర్సనాలిటీ.. మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ట్యాగ్‌ లైన్‌ పెట్టారు.  ప్రపంచ అథ్లెటిక్స్‌ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌ గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హ్యాట్సాప్ అంటూ హిమదాస్ ను కీర్తిస్తున్నారు. కన్నీరు ఊరికే రావని, ఆ సమయంలో నీకు దేశభక్తి గుర్తు చేసిందని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. రాబోయే రోజుల్లో మరిన్ని మ్యాచ్ లు గెలిచి, దేశానికి మంచి పేరు తీసుకురావాలంటూ అభినందలు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates