జానపద కళాకారుడుగా ఎంపీ శివప్రసాద్ నిరసన

ఢిల్లీ : జానపద కళాకారుడు వంగపండు ప్రసాద్ వేషంలో మంగళవారం పార్లమెంటులో నిరసన తెలిపారు టీపీపీ ఎంపీ శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నమోడీ ఎన్నికలయ్యాక అన్నీ మరిచాడంటు విమర్శించాడు ఆయన . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇతర హామీలను మర్చిపోయిన మోడీని ఓడించడానికి కదలి రావాలంటూ యువతకు పిలుపునిచ్చాడు శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ అన్యాయం చేశాడు అంటూ జానపద గేయాలాపాన చేశాడు శివప్రసాద్.

రామ్మోహన్ నాయుడు దీక్ష

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఇవాళ నిరాహార దీక్ష ప్రారంభించారు శ్రీకాకుళం ఎంపీ కే.రామ్మోహన్ నాయుడు.  ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు రామ్మోహన్ నాయుడు. ఇవాళ సభ వాయిదా పడే వరకు దీక్ష కొనసాగించనున్నాడు రామ్మోహన్ నాయుడు.

Posted in Uncategorized

Latest Updates