జాబ్ న్యూస్: సెయిల్‌లో ఉద్యోగాలు

sailస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ ఇండస్ట్రీల్లోని టెక్నికల్ విభాగంలోని మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీచేస్తారు. ఎంపికైనవారికి ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణకాలంలో నెలకు స్టైఫండ్ కింద నెలకు రూ.20,600 చెల్లిస్తారు. ట్రైనింగ్ తర్వాత ఏడాదికి రూ.9 లక్షలు సాలరీ ఉంటుంది. వీటితోపాటు ఇతర సదుపాయాలు ఉంటాయి.

మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నికల్): 382

విభాగాలు: మెకానిక‌ల్ -125, మెట‌ల‌ర్జిక‌ల్- 88, ఎల‌క్ట్రిక‌ల్- 88, కెమిక‌ల్ -25, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ -31, మైనింగ్- 25.

విద్యార్హతలు: మెకానికల్/ మెటలర్జికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ మైనింగ్/ మైనింగ్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 65శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ డిగ్రీ ఉండాలి. గేట్ – 2018లో అర్హత సాధించాలి.

ఏజ్ లిమిట్: 2018 ఫిబ్రవరి 01 వరకు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం SC,ST,OBC, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక‌ విధానం: గేట్-2018 స్కోరు, గ్రూప్ డిష్కష‌న్‌, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ లిస్టును తయారుచేసి గ్రూప్ డిస్కషన్‌కు పిలుస్తారు. ఇందులో ప్రతిభచూపిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనావేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు. గేట్ స్కోర్‌కు 75 మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు 25 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: SAIL వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు కింద రూ.500 చెల్లించాలి. SC,STలకు ఇందులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఫిబ్రవరి 21

https://www.sailcareers.com/media/uploads/MAIN_ADVT._MTT_2018-_JAN_-Feb_2018_6.pdf

Posted in Uncategorized

Latest Updates