జాబ్ న్యూస్: TSNPDCL లో ఉద్యోగాలు

tsnpdclతెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్ (TSNPDCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందుకోసం 68 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్, సివిల్) అభ్యర్థులు జూన్ 13, 2018 నుంచి జూన్ 27, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ లిమిటెడ్

పోస్టుల సంఖ్య: 68

పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్

జాబ్ లొకేషన్: తెలంగాణ

ఖాళీల వివరాలు: అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 66పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 2పోస్టులు

విద్యార్హతలు: అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన వర్శిటీ నుంచినుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సంస్థ నుంచి AMIE సెక్షన్ పరీక్ష ఏ, బీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లేదా యూజీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత, సివిల్ ఇంజినీరింగ్ సంస్థ నుంచి AMIE సెక్షన్ పరీక్ష ఏ, బీలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఏజ్ లిమిట్: జనవరి1, 2018 వరకు 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉండాలి. SC,ST,BC లకు 5ఏళ్లు.. పీహెచ్ లకు 10ఏళ్లు ఏజ్ సడలింపు ఉంటుంది

జీతం వివరాలు: నెలకు రూ.41,155 – 63,600/- అప్లికేషన్ ఫీజు SC,ST,BC,పీహెచ్ లు  ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు రూ. 120 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: జూన్ 12, 2018

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభతేదీ: జూన్ 13, 2018

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 27, 2018

వెబ్ సైట్: http://www.tsnpdcl.in/ShowProperty/NP_CM_REPO/Pages/careers/
AE-Notification-2018

Posted in Uncategorized

Latest Updates