జాబ్ మానేసిన నెల తర్వాత 75 శాతం పీఎఫ్

ఓ ఉద్యోగి జాబ్ మానేసిన లేదా కోల్పోయిన నెల రోజుల తర్వాత… తన పీఎఫ్ అకౌంట్ లోని అమౌంట్ ను 75 శాతం విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ సోమవారం(జులై-23) లోక్‌ సభలో తెలిపారు. జూన్ 26న జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించామని గంగ్వార్ తెలిపారు. దీని ప్రకారం… ఓ ఈపీఎఫ్ మెంబర్ నెల రోజుల పాటు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉంటే.. తన మొత్తం సొమ్ములో 75 శాతం విత్‌ డ్రా చేసుకునే వీలుంటుంది. రెండు నెలలపాటు ఉద్యోగం లేకుండా ఉంటే పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవచ్చు. అయితే పెళ్లి కోసం ఉద్యోగం మానేసిన మహిళా ఉద్యోగులు వెంటనే విత్‌ డ్రా చేసుకునే అవకాశం ఉందని గంగ్వార్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates