జార్ఖండ్‌లో కాల్పులు: ఐదుగురు మావోలు హతం

naxalsజార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భార్గవ్‌ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు మూడు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.

Posted in Uncategorized

Latest Updates