జార్ఖండ్ లో గాలి దుమారం : పిడుగులకు 34 మంది మృతి

JARKHANDజార్ఖండ్ పై పిడుగుల వర్షం పడింది. భారీ వర్షానికి 34మంది మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీవర్షం కురిసింది. హర్దొయ్, సితాపూర్, ఫరూఖాబాద్ ప్రాంతాల్లో గాలిదుమ్మారంతో కూడిన రాళ్లవర్షం కురిసింది. మంగళవారం (మే-29) ఉదయం పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పిడుగులు పడిన ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. కరెంట్, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. మరో 24 గంటలు గాలిదుమారం బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Posted in Uncategorized

Latest Updates