జార్ఖండ్ లో ఘోరం : ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు మృతి

జార్ఖండ్ లో ఘోరం జరిగింది. ఢిల్లీలోని బురారీలో సామూహిక ఆత్మహత్యల ఘటన మరిచిపోక ముందే.. జార్ఖండ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. ఆదివారం (జూలై-15) హజారీబాగ్ కు చెందిన నరేశ్ మహేశ్వరి కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. నరేశ్ తొలుత తన తల్లిదండ్రులను, భార్య, కుమారుడిని ఉరితీశాడు. అనంతరం తన కూతుర్ని గొంతునులిమి చంపేశారు. ఆ తర్వాత అదే భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకే వీరంతా చనిపోయినట్లు తెలిపారు అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates