జింకలను కాల్చమని టబునే రెచ్చగొట్టిందంటా!

salluకృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కు ఈరోజు(ఏప్రిల్-5) జోధ్‌పూర్‌ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు విన్నవెంటనే ఒక్కసారిగా సల్మాన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన పక్కనే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు అర్పిత, అల్విరా ఖాన్‌లు కన్నీరుమున్నీరయ్యారు.

హమ్‌ సాథ్‌ సాథ్‌ హై  సినిమా షూటింగ్ నిమిత్తం 1998లో రాజస్ధాన్ లోని జోధ్ పూర్ వెళ్లాడు సల్మాన్ ఖాన్. ఈ సమయంలో సల్మాన్ తో పాటు సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌ లు కూడా ఉన్నారు. ఘూటింగ్ సమయంలో కంకణి గ్రామంలో తిరుగుతున్న రెండు కృష్ణ జింకలపై సల్మాన్‌, ఇతర నటులు కాల్పులు జరిపినట్టు బిష్నోయ్‌ వర్గానికి చెందిన కొందరు స్ధానిక పోలీస్ స్టేషన్ లో కంఫ్లెయింట్ చేశారు. అలా 20 ఏళ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో సల్మాన్‌ ను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం ఈ రోజు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడుతున్న సమయంలో జీపులో పక్కనే కూర్చొని ఉన్న హీరోయిన్  టబు అతడిని కాల్చమని రెచ్చగొట్టారట. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఒకరు న్యాయస్థానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ కేసులో సల్మాన్‌ తప్ప మిగతావారందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఈ రోజు  తీర్పు చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates