జింక కేసు : జోధ్ పూర్ చేరుకున్న సైఫ్, సోనాలీ, టబు

tabu sonali saifదేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సల్మాన్‌ఖాన్ కృష్ణ జింక వేట కేసును గురువారం ఏప్రిల్-5న తీర్పు వెలువరించనుంది జోధ్‌పూర్ కోర్టు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఫస్ట్ ముంబై ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చిన సైఫ్, సోనాలీ, టబు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

కోర్టు తీర్పు రానున్న క్రమంలో సల్మాన్‌ఖాన్ అబుదాబి నుంచి ముంబైకి చేరుకొని..డైరెక్ట్ గా ఇంటికి వెళ్లాడు. సల్మాన్ బుధవారం (ఏప్రిల్-4) రాత్రిలోపు జోధ్‌పూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్ నటిస్తున్న రేస్ 3 షూటింగ్ అబుదాబిలో జరుగుతుంది. 1998లో కంకని గ్రామంలో హత్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్‌తోపాటు సైఫ్, సోనాలీ, టబు, మరో వ్యక్తిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates