జిగేలు రాణితో చెర్రీ మాస్ స్టెప్పులు

POOJAమెగా పవర్ స్టార్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం మార్చి 30న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.  అయితే ఇవాళ (మార్చి-27) రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది రంగస్థం యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హేగ్దే స్పెషల్ సాంగ్ లో నటించిన జిల్.. జిల్.. జిగేల్ అనే సాంగ్ ప్రొమో వీడియోను రిలీజ్ చేసింది.

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి అంటూ సాగే ఈ పాట వీడియో అలరిస్తుంది . ఈ ప్రోమోలో పూజా అందాలు, చరణ్ స్టెప్పులు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ రంగస్థలం సినిమాకి మ్యూజిక్ అందించగా, పాటలు ఇప్పటికే విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల సినిమాలోని రంగా రంగా రంగస్థలాన.. , ఎంత సక్కగున్నావే.. సాంగ్ ప్రోమోలని రిలీజ్ చేసిన చేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates