జిమ్ చేస్తూ విద్యార్థి మృతి.. నిజాం కాలేజీలో నిరసనలు

హైదరాబాద్ : నిజాంకాలేజీలో జిమ్ చేస్తూ.. ఓ విద్యార్థి మృతి చెందడానికి ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. మృతుడి ఫొటోలతో … కాలేజీలో ర్యాలీ తీశారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా భీముగల్ కు చెందిన విజయ్ నాయక్ .. నిజాం కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కాలేజీకి వచ్చిన విద్యార్థి… నిన్న(బుధవారం) జిమ్ చేస్తుండగా సృహ తప్పి పడిపోయాడు. విజయ్ నాయక్ ను హైదర్ గూడ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారని… చికిత్స పొందుతూ మృతి చెందాడని విద్యార్థులు చెప్పారు. గత కొంత కాలంగా జిమ్ ట్రైనర్ ను నియమించాలని కోరుతున్నా పట్టించుకోకుండా కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ నాయక్ నిర్లక్ష్యం చేశాడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసి… మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

Posted in Uncategorized

Latest Updates