జియోకి జేజమ్మ ఆఫర్ : రూ.500కే స్మార్ట్ ఫోన్.. రూ.60కే..

jio-smart-phoneజియోకు షాక్. అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు. ఒక్కడే కలిసి చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఇప్పుడు మిగతా టెలికాం కంపెనీలు అన్నీ కలిసి దండయాత్ర మొదలుపెట్టాయి. పోతేపోనీ.. నష్టం వస్తే రానీ.. జియోకి అయితే చుక్కలు చూపించాల్సిందే అని డిసైడ్ అయ్యాయి కంపెనీలు. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ మూడు కంపెనీలు కలిసి.. జియోకి బాబు లాంటి ఫోన్లు, ఆఫర్ తీసుకురాబోతున్నాయి. ఇండియా టెలికాం రంగంలోనే భారీ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అంబానీకి బాబులాంటి స్కీమ్ తో కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కలిసి రూ.500కే 4G స్మార్ట్ ఫోన్ తీసుకు వస్తున్నాయి. అంతేకాదు నెలకు కేవలం రూ.60కే అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ఇవ్వనున్నాయి. ప్రస్తుతం జియో వాయిస్ కాల్స్ 2G వేగంతో నడుస్తున్నాయి. రూరల్ ఏరియాలో మిగతా నెట్ వర్క్ ల నుంచి మద్దతు లేకపోవటంతో జియో ఇబ్బంది పడుతుంది. దీన్ని అవకాశం తీసుకుని.. 500కే స్మార్ట్ ఫోన్.. నెలవారీ ప్లాన్ 60కే.. వాయిస్ కాల్స్ కూడా 4G స్పీడ్ తో ఇవ్వాలని ఈ మూడు కంపెనీలు కలిసి ఈ ఫ్లాన్ చేశాయి. దీనిద్వారా గ్రామాల్లో కొత్త కస్టమర్లను ఆకర్షించటానికి వీలవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ యాక్షన్ ఫ్లాన్ అమల్లోకి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే 4G స్మార్ట్ ఫోన్.. 500కే అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ తయారీదారులతో చర్చలు కూడా ప్రారంభించాయి.

సాఫ్ట్ వేర్ కోసం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇతర టెక్నాలజీ సంస్థలతో సాఫ్ట్ వేర్ పై చర్చలు కూడా జరిపారు. ఇటీవల జియో రూ.49 ప్లాన్ తీసుకువచ్చింది. దీంతో జియో కస్టమర్లను తమ వైపు తిప్పుకోవటానికి.. కొత్త వాళ్లు అటు వైపు వెళ్లకుండా ఉండటానికి ఈ వ్యూహం రచిస్తున్నాయి కంపెనీలు. మొత్తానికి టెలికాం రంగంలో కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates