జియో అధినేత అంబానీ : చంద్రబాబు సలహాతోనే టెలికాంలోకి వచ్చాం

RIL_electronicఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా వల్లే తమ కుటుంబం టెలికాం రంగంలోకి అడుగుపెట్టిందన్నారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. మంగళవారం(ఫిబ్రవరి13) రాత్రి వెలగపూడిలోని ఏపీ సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ ను సందర్శించారు ముఖేష్ అంబానీ. ఈ సందర్భంగా ముకేష్ అంబానీ మాట్లాడుతూ… 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఓ సారి గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న మా రిఫైనరీని సందర్శించారు. ఆ సమయంలో టెలికాం రంగంలోకి వస్తే బాగుంటుందని, ఊహించనంతగా ఎదుగుతుందని మా నాన్న ధీరూబాయ్ అంబానీకి సలహా ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన సలహాతోనే మా నాన్న టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టారు. టెలికాం రంగంలోకి రావడం రిలయన్స్ కంపెనీకే కాకుండా, దేశంలో సమాచార రంగంలో పెద్ద మలుపు. ఆ విధంగా రిలయన్స్ కంపెనీ చంద్రబాబుకు రుణపడి ఉంటుందంటూ ముఖేష్ తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం ఓ సారి చంద్రబాబుని కలిసానన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తన పాలనకు సంబంధించిన ఒక విజన్ చెప్పారన్నారు. అయితే ఆ మాటలు తాను తేలిగ్గా తీసుకొన్నానన్నారు. ఈ రోజు ఆయన చెప్పింది చేసి చూపించారంటూ, చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నాయకుడంటూ ముకేష్ ప్రశంసించారు.

 

Posted in Uncategorized

Latest Updates