జియో కొత్త ఆఫర్: రూ.499 కే జియో ఫై

jio fi1కొత్త కొత్త ఆఫర్లతో అందర్నీ ఆకట్టుకుంటున్న జియో ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో సరికొత్త ఆఫర్‌తో దూసుకొచ్చింది. టెలికాం దిగ్గజాలకు సవాల్ విసిరే ఆఫర్లతో అందర్నీ అలరిస్తున్న జియో ..ఇప్పుడు జియోఫై ఆఫర్ ద్వారా అందర్నీ అలరించేందుకు రెడీ అయింది. తాజాగా జియోఫై పోర్టబుల్‌ 4జీ రూటర్‌ అమ్మకాలను పెంచడానికి సరికొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది.జియోఫై రూటర్ ధర మార్కెట్లో రూ.999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై జియో కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో జియోఫై రూటర్‌ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది.

గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్‌ రూటర్‌ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించింది. తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కేవలం కొత్త జియోఫై యూనిట్‌ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ డివైజ్‌ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్‌ వర్తించదు. మంగళవారం(జూలై-3) నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది. అయితే ఎప్పుడు వరకు ఈ ఆఫర్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుందో కంపెనీ తెలపలేదు.

జియోఫై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్‌ చేయించుకోవాలి. 12 నెలల పాటు రీఛార్జ్‌ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్‌జియో అందించనుంది.

 

Posted in Uncategorized

Latest Updates