జియో జింగిలాల ఆఫర్ : ప్రతి రోజూ 4.5GB డేటా

jioటెలికాం రంగంలో ఐడియా-వొడాఫోన్ కంపెనీలు ఒక్కటి కాబోతున్న సమయంలో.. టెలికాం రంగంలో ఐడియా అతి పెద్ద కంపెనీగా అవతరించనున్న క్రమంలో.. ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఐడియా-వొడాఫోన్ విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే.. జియో అతిపెద్ద ఆఫర్ ప్రకటించి ఔరా అనిపించింది. ప్రస్తుతం జియో రూ.299 ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీలో ప్రతి రోజూ 3GB డేటా ఇస్తోంది. కస్టమర్లు అడక్కుండానే.. ఉచిత ఆఫర్ ప్రకటించింది. ప్రతి రోజు అదనంగా 1.5 GB డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే నెలకు రూ.299 ప్యాక్ తీసుకుంటే.. 28 రోజులపాటు ప్రతిరోజు 4.5 GB డేటా లభించనుంది. అంటే మొత్తంగా 126 GB డేటా పొందనున్నారు కస్టమర్లు. ప్రతి మరి ఏ ఇతర కంపెనీ నెట్ వర్క్ లోనూ ఈ ప్యాక్ రేటులో.. ఇంత డేటా ఇస్తున్న దాఖలాలు లేవు. డేటా ఎక్కువ ఉపయోగించుకునే వారికి జియోలో ఇది బెస్ట్ ప్యాక్ అంటోంది మార్కెట్.

దీంతోపాటు మరికొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చింది జియో. రూ.149, రూ.349, రూ.499 ప్యాక్ లపైనా ప్రతి రోజూ 3GB డేటా అందిస్తోంది. అంతేకాకుండా మైజియో యాప్ ద్వారా రూ.300పైన రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు రూ.100 డిస్కొంట్ ఇస్తోంది. అంత కంటే తక్కువగా రీఛార్జ్ చేసుకునే వారికి కూడా 20శాతం డిస్కొంట్ ఇస్తూ.. అందరికీ అన్ని ప్యాక్స్ పై ఆఫర్స్, డిస్కొంట్ ఇచ్చింది జియో నెట్ వర్క్.

Posted in Uncategorized

Latest Updates