జియో మరో ఆఫర్: జియో ఒప్పో మాన్‌సూన్‌

JIO,OPPOదేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తోంది. కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే ఊపులో మరో సరికొత్త ఆఫర్ తో దూసుకువస్తోంది. జియో ఒప్పో మాన్‌సూన్‌ ఆఫర్‌ పేరిట మరో సంచలన ఆఫర్‌ను తన ప్రీపెయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్‌ కింద యూజర్లు 3.2 TB జియో 4G డేటాను పొందనున్నారు. 4.900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్‌ యూజర్లకు ఆఫర్‌ చేస్తోంది.

జియో ఒప్పో మాన్ సూన్ ఆఫర్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌ పాత లేదా కొత్త జియో సిమ్‌ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఇతర ఫోన్ కలిగిన వారు ఈ ఆఫర్‌ వర్తించదు.

అయితే ఈ ఆఫర్‌ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. పాత ఒప్పో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జియో సిమ్ ద్వారా ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. జూన్‌ 28 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఈ ఆఫర్‌ను పొందడానికి మాత్రం సబ్‌స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్‌ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా 1,800 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు 50 రూపాయల విలువైన 36 క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల రూపంలో పొందవచ్చు. 13వ, 26వ, 39వ రీఛార్జ్‌ల తర్వాత 600 రూపాయల చొప్పున మూడు సార్లు యూజర్లకు 1,800 రూపాయలు క్రెడిట్‌ కానున్నాయి.

Posted in Uncategorized

Latest Updates