జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్

జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్ ప్రారంభమైంది. తమ పాత ఫీచర్ ఫోన్లు ఇచ్చి రూ.501 చెల్లిస్తే కొత్త జియో ఫోన్ ఇస్తారు.  ఈ 501 రూపాయలు కూడా మూడేళ్ల తర్వాత ఫోన్ ఇస్తే వంద శాతం తిరిగిస్తారు. అయితే కస్టమర్లు తెచ్చిన పాత ఫోన్లు కచ్చితంగా పనిచేసేలా ఉండాలి. విరిగిన, కాలిన, కొన్ని విడిభాగాలు పోయిన ఫోన్లను తీసుకోరు. పైగా చార్జర్ కూడా కచ్చితంగా ఉండాలి. 2015, జనవరి 1 తర్వాత అమ్మిన ఫోన్లను మాత్రమే ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. కొత్త జియోఫోన్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను పొందాలంటే కచ్చితంగా రూ.594ను కూడా చెల్లించాలట. ఈ మొత్తం ఆరు నెలల పాటు డేటా, వాయిస్‌ కాల్స్‌ పొందడం కోసం ఉపయోగపడుతుంది.

ఈ మొత్తాన్ని కూడా కొత్త జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే చెల్లించాలని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates