జియో షాకింగ్ : వ్యాలెట్ నుంచి అకౌంట్లకు నో క్యాష్

JIO S

కస్టమర్లకు జియో షాక్ ఇచ్చింది. జియో వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్లకు డబ్బు బదిలీ చేయటాన్ని రద్దు చేసింది. ఫిబ్రవరి 27 నుంచి జియో మొబైల్ వ్యాలెట్ (నాన్ బ్యాంకింగ్) ద్వారా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపుకోలేమని తెలిపింది. ఈ మేరకు జియో మనీ (జియో పేమెంట్ వ్యాలెట్) యూజర్లకు మెసేజ్ పంపిస్తోంది.

ప్రస్తుతం తమ వ్యాలెట్ లో ఉన్న డబ్బులను కస్టమర్లు ఫిబ్రవరి 26వ తేదీలోపు ఎలాంటి ఛార్జీ లేకుండా బదిలీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవటం జరిగిందని జియో ప్రకటించింది.  అయితే ఇది జియోకే వర్తిస్తుందా.. మిగతా అన్ని వ్యాలెట్లకు వస్తుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates