జియో 2 : వాట్సాప్, యూట్యూబ్, FBతో కొత్త ఫోన్

jio-tvజియో సంచలనాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జియో-2 విడుదల చేశారు. రూ.3వేలకే అన్ని ఫీచర్స్ తో ఫోన్ అందిస్తోంది. ఇందులో ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ ప్యూచర్స్ తో కొత్త ఫోన్ విడుదల అవుతుంది. కొత్త జియో ఫోన్ లో ఉండే  ఫీచర్స్ అన్నీ కూడా.. పాత జియోలో కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.

జియో-2 ఫీచర్స్ ఏంటీ :

ఆపరేటింగ్ kaios, 512MB RAM, 4GB RAM, 128GB కు స్టోరేజ్ పెంచుకోవచ్చు, 2.4 QVGA డిస్ ప్లే, 2 మెగా ఫిక్సల్ రేర్ కెమెరా, VGA ఫ్రంట్ ఫేస్ కెమెరా, డ్యూయల్ సిమ్, ఒకటి 4Gలో పనిచేస్తోంది. మరొకటి VOLTEలో వర్క్ చేస్తోంది. వై-ఫై కనెక్టివిటీ ఉంది, FM, బ్లూటూత్, GPS, NFC ఫీచర్స్ ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates