జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్: ఎంపీ కవిత

kavithaజిల్లాకు ఒక క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్ లోని  బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి 18వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా  ఆమె పాల్గొన్నారు. క్యాన్సర్‌ ఆస్పత్రిని బాలకృష్ణ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. క్యాన్సర్‌ కారణంగా ప్రతీ ఏడాది ఐదున్నర లక్షల మంది చనిపోతున్నారన్నారు. ఏటా ఏడు లక్షల మందికి కొత్తగా క్యాన్సర్‌ వస్తోందన్నారు. క్యాన్సర్‌ విషయంలో ఎంత చేసినా… ఇంకా చేయాల్సి ఉందన్నారు. బ్రేస్ట్ కాన్సర్ ,సర్వైవకాల్ కాన్సర్ పైన  మహిళలు ప్రతీ ఏడాది పరీక్షలు చేయించుకోవాలన్నారు. కాన్సర్ ని తొలిదశలో గుర్తిస్తే  తగ్గించుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా కాన్సర్ జయించిన పేషేంట్ల ని సన్మానించారు ఎంపీ కవిత.

క్యాన్సర్‌ను తరిమికొట్టాలనే ఆశయానికి ప్రతిరూపమే బసవతారకం ఆస్పత్రి అని అన్నారు ఆస్పత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ. బసవతారకం ఆస్పత్రి లాభాపేక్షలేని సంస్థ అన్నారు బాలకృష్ణ. క్యాన్సర్‌ రోగులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆస్పత్రి ద్వారా సేవలు అందిస్తున్నామని, క్యాన్సర్‌ నియంత్రణపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య సేవలు పొందిన ఏ ఒక్కరు ప్రశంసించినా… మా అమ్మ దీవెనలే అనుకుంటామన్నారు. ఆసుపత్రికి ట్యాక్స్ రద్దు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు తరుపున ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ.

ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి శ్రియ, దర్శకుడు బోయపాటి.. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పునర్జన్మ పొందారన్నారు.

Posted in Uncategorized

Latest Updates