జిల్లాలకు చేరిన బతుకమ్మ చీరలు

బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం కానుకగా ఇచ్చే చీరలు జిల్లాలకు చేరాయి.   చీరలను భద్రపరిచేందుకు జిల్లాలోని మార్కెట్ కమిటీ యార్డులో, సీఎల్‌ఆర్ శిక్షణ కేంద్రంలోని గోదాములను అధికారులు గుర్తించారు. రేషన్ కార్డు ఉండి 18 ఏండ్లు నిండిన యువతులు, మహిళలందరికీ ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తోంది. పండుగకు ముందుగానే వీటిని ఆడపడుచులకు అందజేయాలని అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ క్రమంలోనే మండలాల వారీగా వివరాలు సేకరించారు. అక్టోబర్ మొదటి వారంలో వీటిని పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. మండల స్థాయిలో ప్రత్యేకాధికారి, MPDO, తహసీల్దార్‌ లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మండల, గ్రామస్థాయి కమిటీల ఎంపిక పూర్తి కాగానే ..గోదాముల నుంచి గ్రామాలకు చీరలను పంపిణీ చేస్తారు.

 

 

Posted in Uncategorized

Latest Updates