జిల్లాల్లో జోరుగా బతుకమ్మ చీరెల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ మొదలైంది. బతుకమ్మ పండుగకు పంపిణీ చేయాల్సిన చీరలు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోవడంతో.. ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తోంది.

నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. సిరిసిల్లలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,  సిద్ధిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ తో ఆగిన చీరలు.. సంక్రాంతి పండక్కి ముందే పంపిణీ చేస్తున్నామన్నారు హరీష్. క్రిస్మస్, రంజాన్ పండులకి కూడా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలకు చీరలు అందజేశారు ప్రజాప్రతినిధులు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్, కుమ్రం భీం జిల్లా సిర్పూర్ టి.కాగజ్ నగర్ నియోజకవర్గంలోని వంజిరి గ్రామంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్… చీరల పంపిణీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగు రామన్న, నిర్మల్ లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

పండగ పూట ఆడ పడుచులకు చీర పెట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారన్నారు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో మహిళలకు చీరలు అందజేశారు. ఎన్నికల కోడ్ కారణంగా బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయలేకపోయామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావు చీరలు పంపిణీ చేశారు. మతాలతో సంబంధం లేకుండా మహిళలందరికీ చీరలు అందజేస్తామన్నారు. బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి అడ్డుకుందని ఆరోపించారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు పువ్వాడ.

మెదక్ జిల్లా శివంపేట్, నర్సాపూర్ మండలాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గంలో గంగుల కమలాకర్, మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.. బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి చీరల పంపిణీ ప్రారంభించారు. మహిళలకు చీరలు అందజేశారాయన.  జగిత్యాల జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్ట్ రాజేశం, మున్సిపల్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మితో కలిసి.. మహిళలకు చీరలు అందజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆలేరు నియోజకవర్గంలోని మహిళలకు బతుకమ్మ చీరలను ప౦పిణి చేశారు ఎమ్మెల్యే గొ౦గిడి సునీత.

Posted in Uncategorized

Latest Updates