జిల్ జిల్ జిగేల్ : అది బస్సు కాదు.. కదిలే డిస్కో పబ్

busఅది ఒకటో నెంబర్ బస్సు.. దాని యవ్వారం నాకు తెలుసు.. అది కేరళ రూటు.. అయినా మిగతా రాష్ట్రాలు చూడు.. అంటూ అప్పట్లో బొబ్బులిపులి సాంగ్ లోని ఎన్టీఆర్ – శ్రీదేవి బస్సు పాటను పేరడీ చేసేస్తున్నారు ఈ బస్సును చూసి. ట్రావెల్స్ బస్సు ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలో చిక్కూస్ అనే ట్రావెల్స్ ఉంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడుపుతుంది. టూరిస్టుల కోసం కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. రొటీన్ గా ఉంటే వెరైటీ ఏముందీ అనుకున్నదో ఏమో.. తమ బస్సులన్నింటినీ మార్చేసింది. పబ్స్, డిస్కో బార్లలో ఎలాంటి వాతావరణం ఉంటుందో.. అచ్చం అలాంటి అనుభూతినే.. తన బస్సు ఎక్కిన ప్రయాణికులకు అందిస్తోంది. బస్సు ఎక్కిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు.

బస్సులో డీజే ఏర్పాటు చేశారు. ఆ పాటలకు తగ్గట్టుగా లైటింగ్ సిస్టమ్ పెట్టారు. హోరెత్తించే పాటలతో.. డిస్కో లైట్లు, డీజే హోరు.. డాన్స్ చేయటం ఒక్కటే తక్కువ. మందు, విందు తప్ప.. మిగతావన్నీ ఉన్నాయనే ఫీలింగ్ కల్పిస్తోంది ఈ ట్రావెల్స్. అంతేకాదు.. బస్సుకి మరింత అందాలు తీసుకొచ్చింది. బస్సు చుట్టూ పోర్నస్టార్ ఫొటోలను అంటించింది. కాకపోతే న్యూడ్ కాదండీ.. వారి ఫొటోలను వాడుకున్నది. సన్నిలియోన్, మియా మాల్కోవా, మియా మార్ఫీ, షకీల ఇలాంటి బోలెడు మంది అందమైన అమ్మాయిల ఫొటోలను వేసింది. ఆ బస్సును చూస్తే చూపు తిప్పుకోలేం.. ఒక్కసారి ఎక్కితే మళ్లీ మళ్లీ ఆ బస్సులోనే ప్రయాణించాలనే ఫీలింగ్ కోసమే ఇలాంటి ప్రయోగం చేసినట్లు చెప్పారు. దీని కోసం అదనంగా ఎలాంటి ఛార్జీ వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది యాజమాన్యం. యువత మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఇలాంటి బస్సులు కూడా ఉంటాయా అని నెటిజన్లు అయితే ఫిదా అవుతున్నారు. పెద్దలు అయితే ఇదేం గోల.. ఆ బస్సు ఎక్కితే చెవులు పోతున్నాయ్.. నిద్ర పట్టటం లేదు అంటున్నారు. దేశంలోనే ఫస్ట్ టైం ఓ ట్రావెల్స్.. తన బస్సుల్లో లోపల డీజే, డిస్కో పబ్ లుక్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే బయట అందమైన ఫొటోలతో రా రమ్మని పిలుస్తోంది. కొత్త హంగులు ఎంత వరకు ఆక్యుపెన్సీని పెంచాయో మాత్రం చెప్పటం లేదు ట్రావెల్స్ యాజమాన్యం…


Posted in Uncategorized

Latest Updates