జీఎస్టీ చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణ : అరుణ్ జైట్లీ

arunగూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(GST) చరిత్రాత్మక ఆర్థిక సంస్కరణ అన్నారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. పాత  పరోక్ష పన్నుల విధానం సంక్లిష్టంగా ఉన్నందునే జీఎస్టీ తీసుకొచ్చినట్టు జైట్లీ తెలిపారు. ప్రస్తుతం టాక్స్ విధానం పూర్తిగా సరళంగా మారిపోయిందని చెప్పారు.  జీఎస్టీ వార్షికోత్సవ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. మరోవైపు జీఎస్టీ విజయాన్ని ప్ర‌జ‌ల‌ విజయంగా అభివర్ణించారు ప్రధాని మోడీ. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని మోడీ అన్నారు. అన్ని వ‌స్తువుల‌కు ఒకే జీఎస్టీ రేటు సాధ్యం కాద‌న్నారు. పాల‌ను, మెర్సిడెస్ బెంజ్ రెండింటినీ ఒకే శ్లాబు రేటులో పెట్ట‌డం సాధ్యం కాదని మోడీ అన్నారు.

జీఎస్టీతో దీర్ఘ‌కాలంలో ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయని, జీఎస్టీ అమ‌లుకు స‌హ‌క‌రించిన అన్ని రాజ‌కీయ పార్టీలు, నాయ‌కుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. గతంలో  ప్ర‌జ‌ల‌కు ప‌న్ను రేట్లు, సెస్సుల గురించి తెలిసేది కాదని,  ప్ర‌స్తుతం వివిధ స్థాయిల్లో వ‌స్తువుల‌కు ఎంత ప‌న్ను చెల్లిస్తున్నారు అనేది తెలుస్తుందని  గోయెల్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates