జీఎస్టీ రిటర్న్స్ గడువు పెంపు

జీఎస్టీ రిటర్న్స్ గడువును మరో మూడు నెలలు పెంచుతూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక జీఎస్టీ రిటర్న్స్ ను మార్చి 31,2019 వరకు దాఖలు చేసుకోవచ్చు. గతంలో ఈ గడువు డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉండేది. కొన్ని కంపెనీలు పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9ఏ, జీఎస్టీఆర్-9సీలను మార్చి 31వరకు రిటర్న్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు నిర్మాణ రంగానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కంప్లీషన్ సర్టిఫికెట్ ఉన్న రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలుదారులకు జీఎస్టీ వర్తించబోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న(శనివారం) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే నిర్మాణంలో ఉన్న ఆస్తుల కొనుగోలుపై లేదా నిర్మాణం పూర్తయ్యి అమ్మిన సమయంలో కంప్లీషన్ సర్టిఫికెట్ లేని ఫ్లాట్లకు జీఎస్టీ ఉంటుందని స్పష్టం చేసింది.

Posted in Uncategorized

Latest Updates