జీడిమెట్లను కమ్మేసింది : కెమికల్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్

vijayasriమేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం (ఫిబ్రవరి-23) ఉదయం భారీ  అగ్నిప్రమాదం  జరిగింది. సుభాష్ నగర్ లోని  విజయశ్రీ  కెమికల్  గోదాంలో  పెద్ద ఎత్తున  మంటలు ఎగిసిపడ్డాయి.  కెమికల్  డ్రమ్ములు  ఉండటంతో  చుట్టు పక్కల  పొగ అలుముకుంది.  గోదాంలో 20 మంది  కార్మికులు  పనిచేస్తుండగా  ఆరుగురికి  తీవ్ర గాయాలయ్యాయి.  ఇందులో ఇద్దరి  పరిస్థతి  సీరియస్ గా  ఉన్నట్లు తెలుస్తోంది.  నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు  ప్రయత్నిస్తున్నారు  అగ్నిమాపక  సిబ్బంది. పెద్ద మొత్తంలో  ఆస్తి నష్టం జరిగి  ఉండవచ్చని  భావిస్తున్నారు.
https://youtu.be/RHlU2qp5aYc

Posted in Uncategorized

Latest Updates