జీపీఎఫ్‌ వడ్డీ రేటు 8% కి పెంపు

ఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్‌) వడ్డీ రేటును పెంచింది. జీపీఎఫ్‌, సంబంధిత పథకాలకు అక్టోబరు- డిసెంబరు త్రైమాసానికి వడ్డీని 0.4% పెంచి 8% చేసింది. జూలై- సెప్టెంబరు త్రైమాసానికి జీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.6% ఉంది. పెంచిన వడ్డీరేట్లు అక్టోబరు 1నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది కేంద్ర ఆర్థికశాఖ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణశాఖ ఉద్యోగుల భవిష్య నిధికి ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates